బాబు కడవల కొద్దీ కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు: విజయసాయిరెడ్డి

  • కరోనా తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు అంటున్నారు
  • బానిస విశ్వాసంతో కిరసనాయిలు వార్తలు రాస్తున్నారు
  • బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెడుతున్నాడు
  • దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు కాదు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఓ మీడియా సంస్థ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఎవరూ నమ్మట్లేదని ఆయన అన్నారు. ఓ మీడియా సంస్థ అధినేత బాబుకు అనుకూలంగా వార్తలు రాస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని విమర్శించారు.

'కొవిడ్-19 తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదు' అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News